
బస్ డ్రైవర్ల కు 15 రోజుల జైలు శిక్ష
ఆదోని న్యూస్ వెలుగు: ఆదోనిలో సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు రెండవ పట్టణ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ తనిఖీల్లో పట్టుబడ్డ స్లీపర్ బస్ డ్రైవర్ల కు 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు సీఐ తెలిపారు. 120 మంది ప్రయాణికులతో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ ఐ వి ఆర్ ఎస్ ట్రావెల్స్ డ్రైవర్లు గా పోలీసులు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డ్రైవర్ గణేష్ సుదీర్ లకు జైలు శిక్ష విధించిన ఆదోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్. ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే విధంగా ప్రవర్తించిన డ్రైవర్ల పై కఠిన చర్యలు తీసుకున్న న్యాయస్థానం. డ్రైవర్లను సబ్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!

