
గంజాయి బ్యాచ్ ను అదుపులోకి తీసున్న పోలీసులు
డోన్ న్యూస్ వెలుగు : గంజాయి అక్రమ రవాణా పై ప్రత్యేక దర్యాప్తులో భాగంగా మంగళవారం రైల్వే స్టేషన్ బయట పరిసర ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్ భాష వెల్లడించారు.
ముద్దాయిల వివరాలు: A1: ఈడిగ ఈశ్వర్ గౌడ్ @ గాలిగాడు, వయసు: 28 సంవత్సరాలు, S/o ఈడిగ చంద్రశేఖర్, నివాసం: శ్రీనివాస టాకీస్ సమీపం, కొత్త పేట, డోన్ టౌన్, నంద్యాల జిల్లా. A2: షేక్ హస్సేన్ @ హసన్ వలి @ హసన్ బాయ్, వయసు: 27 సంవత్సరాలు, S/o షేక్ ఇస్మాయిల్ సాహెబ్, పాతపేట, డోన్ టౌన్, నంద్యాల జిల్లా. A3: చాకలి హరికృష్ణ @ గుండు, వయసు: 20 సంవత్సరాలు, S/o చాకలి వెంకటేష్, సుంకాలాఫీస్ సమీపం, కొండపేట, డోన్ టౌన్, నంద్యాల జిల్లా.పై ముగ్గురిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడికి పంపడమైనదని డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్ భాష తెలిపారు. వీరికి ఎక్కడ నుండి గంజాయి వచ్చింది అని పూర్తిగా దర్యాప్తు తరవాత మీడియా కు వెళ్లాడిస్తామని డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్ భాష వెల్లడించారు. ఈ దాడుల్లో డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్ భాష, ఎస్సై శరత్ కుమార్ రెడ్డి మరియు సిబ్బంది నాగరాజు, సీతారామయ్య, రాము పాల్గొన్నారు.

