కొండరాళ్లు పడకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి 

కొండరాళ్లు పడకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి 

ఇంద్రకీలాద్రి,న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ  శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి ఘాట్ రోడ్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డ ప్రదేశములను క్షేత్ర స్థాయిలో పరిశీలించగా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ,  ఆలయ ఈవో కె ఎస్ రామరావు, ఆలయ ఈఈ లు కె వి ఎస్ కోటేశ్వరరావు, లింగం రమ పరిస్థితు

లను  మంత్రివర్యులకు వివరించారు. ఈ సందర్బంగా మంత్రివర్యులు కొండరాళ్లు పడకుండా ప్రస్తుతమునకు తాత్కాలికముగా  శాశ్వతం ప్రాతిపదికన చర్యలు తీసుకొనవలసినదిగా ఆదేశించారు.   నగర పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు యలమంచిలిసత్యనారాయణ సుజనా చౌదరి కూడా సంఘటన స్థలాన్ని ఆలయ ఈవో తో పాటుగా పరిశీలించారు. అనంతరం మంత్రివర్యులు  ఇరువురు చర్చించుకొని, ఈ సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు, చర్యలు తీసుకొనవలసినదిగా తెలిపారు.అనంతరం  మంత్రివర్యులు సింగ్ నగర్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులు సమీక్షించుటకు సింగ్ నగర్ వెళ్ళగా సింగ్ నగర్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పాల్గొన్న  రాష్ట్ర హోం మంత్రివర్యులు వంగలపూడి అనిత తో కలిసి మాట్లాడారు. అనంతరం  హోం మంత్రివర్యులతో కలిసి వరద పరిస్థితులను పరిశీలించి, ప్రజలతో మాట్లాడి వారికి పులిహోర ప్యాకెట్లను అందజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!