ఆశా కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కడప,న్యూస్ వెలుగు ;ఆశా కార్యకర్తల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మంగళవారం కడప నగరంలోని డిఎంహెచ్వో కార్యాలయంలో అదనపు డిఎంహెచ్ఓ అధికారికి ఉమామహేశ్వరరావు వినతిపత్రం ఇవ్వడం జరిగిదని సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనురు శ్రీనివాసులురెడ్డిఅనంతరం మాట్లాడుతూ ఆశావర్కర్స్క వేతనాలు పెంచాలని, 2024 ఫిబ్రవరి 9న రాష్ట్రప్రభుత్వం ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రతినిథి వర్గంతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీఓలు సర్క్యులర్స్ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. ఆశా వర్కర్స వేతనాలు పెంచాలన్నారు. ఆశా వర్కర్ల సమస్యలపై కుటుంబ సంక్షేమశాఖ అధికారులు యూనియన్ రాష్ట్ర ప్రతినిధి వర్గంతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీఓలు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము.సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఆశా వర్కర్స్కు విడుదల చేయవల్సిన ఒప్పంద జిఓలు తాత్కలికంగా నిలుపదల చేసినవి వెంటనే విడుదల చేయాలి , పనిభారంతో అల్లాడుతున్న ఆశావర్కర్స్ సమస్యలపై సార్వత్రిక ఎన్నికలరీత్యా జాయింట్ మీటింగ్స్ జరగలేదు. ఫీల్డ్ వర్క్ సెంటర్వర్క్, అదనపుపనులు, పనిచేయని సెల్ఫోన్ నెట్వర్క్ సమస్యను పరిష్కరించాలి మెజారిటీ ఆశాలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఒక గంట పర్మిషన్ కావాలన్నా, ఒకరోజు సెలవు కావాలంటే అధికారుల దయా దాక్షిణ్యలపై ఆధారపడాల్సి వస్తోంది.
స్థానిక సమస్యల పరిష్కారానికి జిల్లాల్లో జాయింట్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని, ఒప్పంద జీఓలు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము.ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి రాజామణి మాట్లాడుతూఒప్పంద జీవోలు వెంటనే ఇవ్వాలి.60 సంవత్సరాలు నిండిన ఆశాల రిటైర్మెంట్ను జీవోలు విడుదలయ్యే వరకూ ఆపాలి.రికార్డులు వెంటనే ఇవ్వాలి. స్థానిక రాజకీయ నాయకులు వేధింపులాపాలి ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఏఎన్ఎంలు వారు చేయాల్సిన పని ఆశా కార్యకర్తల మీద ఒత్తిడి చేయడం సరికాదు పెరిగిన జనాభా అనుగుణంగా నూతనంగా ఆశా కార్యకర్తలను నియమించాలని కోరారు ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తలను పోస్టును తక్షణం భర్తీ చేయాలి ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కే ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు