7.7 కోట్లు విరాళం ఇచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్

7.7 కోట్లు విరాళం ఇచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్

అమరావతి :   భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులు అయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ సంఘాలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు వరద సహాయక చర్యల కోసం తమవంతు ఆప్త హస్తం అందిస్తున్నారు.  ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి మంగళవారం  విరాళాలు అందజేశారు.  రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల ఒక నెల గౌరవ వేతనం రూ. 7.7 కోట్లు విరాళం ఇచ్చారు. ఛాంబర్ అధ్యక్షులు  వై.వి.బి. రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి  బిర్రు ప్రతాపరెడ్డి, ఛాంబర్ ప్రతినిధులు నుండి అంగీకార పత్రాన్ని పవన్ కళ్యాణ్ అందుకున్నారు. • ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,097 మంది సర్పంచుల ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.3.92 కోట్లు, సంఘం అధ్యక్షులు  చిలకలపూడి పాపారావు ఆధ్వర్యంలో అందుకు సంబంధించిన అంగీకార పత్రాన్ని ఉప ముఖ్యమంత్రి అందుకున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS