కడమకుంట్ల గ్రామంలో వాల్మీకి బోయ సంఘం కమిటీ ఏర్పాటు
తుగ్గలి, న్యూస్ వెలుగు; తుగ్గలి మండల పరిధిలోని గల కడమకుంట్ల గ్రామం నందు వాల్మీకి బోయ పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం రోజున వాల్మీకి బోయ సంఘం కమిటీని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వాల్మీకి బోయ పెద్దలు సంఘం ఏర్పాటు వలన బోయ సోదరులకు కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు.అదేవిధంగా కమిటీలో గల సభ్యులు అనుసరించవలసిన విధివిధానాలను మరియు సంఘం అభివృద్ధికి తోడ్పడే అంశాలను పెద్దలు వివరించారు. గ్రామంలోని వాల్మీకి బోయ పెద్దల సమక్షంలో అందరి ఆమోదంతో కమిటీను ఎన్నుకున్నారు.కడమకుంట్ల గ్రామ వాల్మీకి బోయ సంఘం గౌరవాధ్యక్షులుగా తలారి చౌడప్ప, గౌరవ ఉపాధ్యక్షులుగా బొగ్గుల రామకృష్ణ, గౌరవ కార్యదర్శులుగా బొగ్గుల నాగేశ్వరరావు,మారిక రామాంజనేయులు,కాయల ఓబులేసు, మారిక చిన్న పకీరప్ప,గౌరవ సహాయ కార్యదర్శిగా మారిక శ్రీరాములు, సుఖేంద్ర,రాజశేఖర్,రామానాయుడు, గౌరవ కోశాధికారిగా కొండా వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కడమకుంట్ల వాల్మీకి బోయ సంఘం అభివృద్ధి కొరకు తమ వంతు కృషి చేస్తామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కడంకుంట్ల గ్రామం మాజీ సర్పంచ్ పక్కీరప్ప,గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.