వద్దిరాల ఏపీజీబీ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ ఇష్టారాజ్యం–పైసా వసూల్ రాజా….!

వద్దిరాల ఏపీజీబీ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ ఇష్టారాజ్యం–పైసా వసూల్ రాజా….!

మైలవరం, న్యూస్ వెలుగు; కడప జిల్లా మైలవరం మండలం వద్దిరాల ఏపీజీబీ బ్యాంక్ (IFC కోడ్ 2095 )బ్యాంకులో పనిచేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ అక్రమ వసూళ్లకు తెర లేపారు. పర్సంటేజ్ ఇస్తేనే లోన్ ఇవ్వడానికి కానీ, రెన్యువల్ చేయడానికి కానీ, ఓ రేటు ఉంటుంది ఆ రేటు కుదిరితేనే పని చేస్తారు లేకపోతే రోజుల తరబడి రేపు మాపు అని కాళ్లు అరిగేలా తిరిగిన కనికరించని వైనం. బ్యాంకు మేనేజర్ ని సంప్రదించగా ఫీల్డ్ ఆఫీసర్ తో మాట్లాడుకోండి అని అంటున్నారని బ్యాంకు ఖాతాదారులు ఆరోపిస్తున్నారు.

మైలవరం మండలం వద్దిరాల గ్రామానికి చెందిన గడ్డం ఓబులేసు అనే వ్యక్తి దాదాపు పది సంవత్సరాలుగా బ్యాంకులొ లోను తీసుకొని రెగ్యులర్ గా రీపేమెంట్ కడుతున్న రీపేమెంట్ చరిత్ర బాగాలేదని అనేక కోర్రిలు పెట్టి పై అధికారులు పంపిస్తా సరిగా కఠిన కట్టలేదని, లోనైతే ఇచ్చేది లేదు నా మామూలు నాకు ఇస్తేనే తప్ప అనితెగేసి చేసి చెబుతున్నారని, యూనిట్ ఉన్న లోన్ ఇవ్వడం లేదని తాను నిరుద్యోగునని చేసేదేమీ లేక అంగడి పెట్టుకునే జీవనోపాధిని కొనసాగిస్తున్నానని, వారు అడిగేంత డబ్బులు ఇవ్వలేనని ఎంతో కొంత ఇస్తానన్నా, లోన్ ఇచ్చిన మీరందరికీ చెబుతారని నేను ఇవ్వను అని అంటున్న ఫీల్డ్ ఆఫీసర్. ఇది ఈయన ఒకరి సమస్య కాదు… చుట్టుపక్కల గ్రామాలైన చిన్నవెంతుల, ధన్న వాడ,గొల్లపల్లి,మాధవాపురం, నక్కవానిపల్లి,గ్రామాల ప్రజలు, చిన్న,సన్నకారు రైతులు, ఏ ఇతర లోన్స్ తీసుకోవాలని చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ధనవంతులకు,వ్యాపారస్తులు అనేక లక్షల రూపాయలు,కోట్ల రూపాయలు ఇస్తున్నారు, వారికి ఇవ్వడానికే ఉత్సాహం చెబుతున్నారు కానీ చిన్న, సన్నకారు రైతుల బాధలు అర్థం చేసుకొని వద్దిరాల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది. గతంలో కూడా ఈ బ్యాంకు పైన శనగల గోడౌన్ విషయంలో కోట్ల రూపాయలు వెలుగులోనికి వచ్చాయి. అయినా కూడా తమ వైఖరి మార్చుకోలేదని చుట్టుపక్కల గ్రామస్తులు, మరియు చిన్న,సన్నకారు రైతులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై కడప రీజనల్ ఆఫీసర్ గారికి సంప్రదించగా బ్యాంకు మేనేజర్ ను కలవండని చెప్పారు. ఆయన మాట తూచా తప్పకుండా బ్యాంకు మేనేజర్ ని సంప్రదించగా, ఆయన ఈ రోజు, రేపని కాలయాపన చేస్తున్నారే తప్ప లోన్లు ఇవ్వడం లేదని రైతులు, నిరుద్యోగ యువతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీజీబి బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో చుట్టుపక్కల గ్రామాల రైతులు, యువకులు పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!