బొందిమడుగుల గ్రామంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం

బొందిమడుగుల గ్రామంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం

తుగ్గలి, న్యూస్ వెలుగు: తుగ్గలి మండల పరిధిలోని గల బొందిమడుగుల గ్రామం నందు స్వచ్ఛత హీ సేవ-2024 కార్యక్రమంను అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు గురువారం రోజున నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ గౌరవ సలహాదారుడు ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ పత్తికొండ ఎమ్మెల్యే కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు తుగ్గలి మండలంలోని బొందిమడుగుల గ్రామం నందు గ్రామ సర్పంచ్ యండ చౌడప్ప ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛ భారత్ వారోత్సవాల సందర్బంగా శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గౌరవ సలహాదారులు సలీంద్ర ప్రతాప్ యాదవ్,గ్రామ పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు ప్రజాప్రతినిధులు కాలువలను శుభ్రపరిచారు.అనంతరం గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలోని ప్రధానోపాధ్యాయురాలు తిరుమలేశ్వరి,పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల సమక్షంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో పరిసరాలు పరిశుభ్రత అంశాల గురించి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు,వీరేంద్ర,ఉసేన్,సుబ్బ రాయుడు,నారాయణ,వెంకటేష్,నరేష్ మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!