
ఈనెల 27 న “ఏచూరి” “సంస్మరణసభ”ను జయప్రదం చేయండి
కడప, న్యూస్ వెలుగు ;భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ , సిపిఎం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఈనెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు సి.పి.ఎం. అఖిల భారత ప్రధాన కార్యదర్శి “సీతారాం ఏచూరి సంస్మరణ సభ”కు జిల్లాలోని ప్రముఖులందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కడప నగరంలోని నక్కాస్ లోని స్థానిక సి.పి.ఎం. శాఖ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన “విలేకరుల సమావేశంలో” లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కామనురు శ్రీనివాసులు రెడ్డి బి దస్తగిరి రెడ్డి హాజరై వారు మాట్లాడుతు కడప జిల్లాలో కామ్రేడ్ సీతారాం ఏచూరి తో పరిచయం ఉన్న జె.ఎన్.యు. విద్యార్థులు పలు రంగాల్లో స్థిరపడ్డ వారు ఉన్నారని, పార్లమెంట్లో జిల్లా ఎం.పీ.లుగా గెలిచి ఏచూరితో పరిచయం ఉన్నవారు ఉన్నారని, ఏచూరి గురించి తెలిసిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వామపక్షాల నాయకులు ఉన్నారని, వారందరూ ఈ సంస్మరణ సభకు హాజరవుతారన్నారు. ఈ సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా సి.పి.ఎం. కేంద్ర కమిటీ సభ్యులు, కామ్రేడ్ ఎం.ఏ. గఫూర్ హాజరవుతున్నారని తెలిపారు. సి.పి.ఎం. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడం మాత్రమే కాదు, భారత రాజ్యాంగం పీఠికలోని అంశాలకు రక్షకుడిగా తన జీవితాన్ని ధారపోశారన్నారు, ఆయన లౌకిక ప్రజాస్వామ్య భారతాన్ని శ్వాసించారు. సామ్యవాద దృష్టితో పాలన జరగాలని జీవించారు. భారత ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఆయన లేని లోటు పెద్ద శూన్యం అన్నారు. విలువలు కోసం నిబద్దతతో ఆయన సాగించిన నడక ఎందరికో దారి చూపించిందన్నారు. దేశ భవిత కోసం ఆయన వెల్లడించిన ఆలోచనలని వ్యతిరేకించడానికి ప్రత్యర్థి పార్టీలు కూడా సాహసించ లేదన్నారు. చివరకు ఆయన శరీరాన్ని కూడా వైద్య విద్య కోసం ఢిల్లీ ఎయిమ్స్ కు అప్పగించారని కొనియాడారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ పదవికి రాజీనామా చేయాలని ఇందిరా గాంధీనే నిలదీసిన విద్యార్థి నాయకుడు ఏచూరన్నారు. జేఎన్‌యు ఎన్నికల్లో ఇందిరా పెద్ద కోడలు మేనకా గాంధీ నే ఓడించ హ్యాండ్రిక్ విజయం సాధించిన విద్యార్థి సీతారాం ఏచూరి అన్నారు. ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని మూసేస్తే ఆయన నాయకత్వంలో 40 రోజులు విశ్వవిద్యాలయాన్ని నడపగలిగారు విజయం సాధించారు. అందుకే ఆయన విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలబడ్డారన్నారువి. అక్కడ నుంచి జాతీయ రాజకీయాల్లోకి నిటారుగా ప్రాపంచిక వామపక్ష మహావృక్షంగా ఎదిగారని కొనియాడారు. దేశంలోని ఎందరో పేదల జీవితాలకు “ఉపాధి హామీ పథకం” రూపంలో అన్నం గిన్నెలో అన్నం అయ్యారన్నారు. ఆయన ఆలోచనలు ఎన్నో చట్టాలుగా రూపొందాయి అన్నారు. సీతారాం ఏచూరి జీవిత కాలం ప్రత్యర్థి బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో “దారి దీపం”తో పోల్చి కొనియాడారు అన్నార ఆయన గురించి ఒక అర పూట కడప జిల్లాలోని ప్రముఖులంతా వచ్చి కూర్చుని ఆయన ఆశయాల సాధనకు మాట్లాడుకోవడానికి ఈ సమస్మరణ సభ ఒక వేదికగా అందరూ రావాలని సంస్మరణ సభ జయప్రద చేయాలని కోరారు. ఈ సమావేశంలో సి.పి.ఎం. నాయకులు జమీల, ఖాజాబీ, లతీఫా భాను, శంషాద్, ముష్రఫ్ తదితరులు పాల్గొన్నారు