భారత జట్టులో కాంస్యం సాధించిన మధుకు అభినందనలు
కర్నూలు న్యూస్ తెలుగు:చైనా దేశంలోని కింగ్ డావోలో ఈ నెల 18 నుంచి 23 వరకు జరిగిన ఆసియా బీచ్ సెపక్ తక్రాలో పురుఘల భారత జట్టు కాంస్యం పతాకాన్ని దక్కించుకుంది. భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కురువ మధుకు కర్నూలు జిల్లా కురువ
సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కే .కిష్టన్న ,అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు , అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, మాజీ అధ్యక్షుడు గడ్డం రామకృష్ణ,జిల్లా అధ్యక్ష , ప్రదానకార్యదర్శి పత్తికొండ శ్రీనివాసులు , ఎం .కే . రంగస్వామి, నాయకులు టి .పాలసుంకన్న , కోశాధికారి కే .సి .నాగన్న ,ఉపాధ్యక్షులు కత్తి శంకర్ ,బి .వెంకటేశ్వర్లు ,టి .ఉరుకుందు ,పెద్దపాడు ధనుంజయ జిల్లా మహిళా అధ్యక్ష ,కార్యదర్శి టి .శ్రీలీల,కే .అనిత ,సహాయ కార్యదర్శి బి .సి .తిరుపాల్ ,బుదూర్ లక్ష్మన్న ,కే దేవేంద్ర ,నగర సంఘం అధ్యక్ష ,కార్యదర్శి తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ ,పెద్దపాడు పుల్లన్న,మద్దిలేటి తదితరులు అభినందనలు తెలిపారు. వరుసగా ప్రత్యర్థి దేశాల జట్లు పై విజయాలు సాధిస్తున్న మధుకు కర్నూలు జిల్లా కురవ సంఘం తరపున అభినందనలు తెలిపారు రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరచిన కారణంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన భారత జట్టు ఎంపిక పోటీల్లో ప్రతిభ కనపర్చి జట్టులో కురువ మధు స్థానం సంపాదించారు. చైనా దేశంలో జరిగిన ఆసియా పోటీల్లో మన రాష్ట్రం నుంచి పాల్గొని పథకాలతో తిరిగి వస్తున్న మధుకు జిల్లా కురవ కులస్థులు తరుపున అభినందనలు తెలిపారు.