
రాయితీపై శనగ విత్తనాలు పంపిణి
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: రబీ 2024 సీజన్ నందు శనగల సాగు కొరకు 25 శాతం సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శనగలను అందజేస్తుంది. ఇందులో తుగ్గలి మండలానికి 650 క్వింటాళ్ల శనగ విత్తనములు మంజూరు అయ్యాయి.

ఈ సందర్బంగా అగ్రికల్చర్ అధికారి జి.పవన్ కుమార్ మాట్లాడుతూ మండలంలో విత్తనములు కావలసిన రైతులు గ్రామంలోని రైతుసేవా కేంద్రాలను సంప్రదించి నమోదు చేసుకోవాలని, రాయితీ వివరాములు క్వింటం పూర్తి ధర 9400,25 శాతం రాయితీ 2350 రూపాయలు పోగా రైతు వాటా క్వింటానికి 7050 రూపాయలు చెల్లించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి,రాతన గ్రామాలకు చెందిన వ్యవసాయ రైతులు,మండల టీడీపీ అధ్యక్షులు తిరుపాల్ నాయుడు, ఎస్టీ సెల్ అధ్యక్షులు వెంకటపతి,రాతన ఈరమ్మ,తుగ్గలి ఎంపీటీసీ రాజు,వీఆర్ఓ నాగేంద్ర,ఏఈఓ లు చైతన్య,సరస్వతి, ఎంపీఈఓ స్రవంతి,విఏఏ లోహిత్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

