బన్ని ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో ఈ నెల 12వ తేదీన జరిగే నేరణికి,నేరణికి తండా,కొత్తపేట గ్రామ ప్రజల ఆరాధ్యదైవం శ్రీ మాళ సహిత మల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవాల ఏర్పాట్లను గురువారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో ఎక్కడ కూడా ఏ పొరపాటు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పట్లను పూర్తి చేయాలని సూచించారు.అలాగే బారిగేట్లు,బారి లైటింగ్ వ్యవస్థ,సిసి కెమెరాలు,పారిశుద్ధ్యం,త్రాగునీరు ఏర్పాట్ల పై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ,డిఎస్పి వెంకటరామయ్య, పత్తికొండఆర్డిఓ భరత్ నాయక్ డిఎల్పీఓ నూర్జహాన్,ఆలూరు సిఐ శ్రీనివాస్ నాయక్,తహసీల్దార్ ప్రసాద్ రాజ్,విద్యుత్ ఏఈ ఓబులమ్మ,ఎంపీడీఓ విజయ లలిత, పీఆర్ఏఈ యమునప్ప,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామ్ లీలా,ఆర్ అండ్ బీ అధికారులు,పంచాయతీ కార్యదర్శులు రాజశేఖర్,షఫీ,విఆర్వోలు నాగరాజ్,దామోదర్,ఆలయ కమిటీ సభ్యులు వీరనాగప్ప,గ్రామ సేవకులు తదితరులు పాల్గొన్నారు.