ఫీల్డ్ అసిస్టెంట్ తీరు మార్చుకోవాలి
ఏపీ దళిత వేదిక జిల్లా ఉపాధ్యక్షురాలు కన్నెలూరు లక్ష్మి
జమ్మలమడుగు, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు మండలం పూర్వ బొమ్మేపల్లి సచివాలయం నందు మంగళవారం సచివాలయంలో నిర్వహించిన గ్రామసభ నందు ఏపీ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు వంగిపురం రెడ్డన్న ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షురాలు కన్నెలూరు లక్ష్మి మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకల గురించి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ బాలయ్య ఉపాధి కూలీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉపాధి పనికి రాని వాళ్లకు సైతం కూళ్లు చెల్లించే విధంగా, ఉపాధి పనికి వచ్చిన వాళ్లకు కూలి చెల్లించడం లేదని ఇదేమిటి అని అడిగిన వారిని మీరు పనికే రావద్దని కూలీలను కించపరుస్తూ మాట్లాడడం హేయమైన చర్యన్నారు. పనికి రావద్దు అనే హక్కు ఫీల్డ్ అసిస్టెంట్ కి ఎవరు ఇచ్చారని గ్రామ సభలో నిలదీయడంతో గ్రామ సభలో మాట్లాడే సమయంలో సర్పంచ్ తండ్రి స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు గునకనపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడనివ్వకుండా బెదిరింపు చర్యలకు పాల్పడడం జరిగిందన్నారు. అయినా కానీ ఆమె మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది గ్రామా గ్రామపంచాయతీ ని అభివృద్ధి పరుచుకోవడానికి తప్ప ప్రజలను ఇబ్బంది పెడుతూ గ్రామ నిధులు దుర్వినియోగం చేస్తూ రాజకీయాలు చేయడానికి కాదని గ్రామసభ ముఖంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల కు తగు న్యాయం చేసే విధంగా ఉన్నతాధికారులు చూడాలని డిమాండ్ చేశారు.