ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు


పసుపులేటి .శివశంకర్‌కు సోమవారం విజయవాడలో అఖిలభారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ ఆర్పిత సాంస్కృతిక సేవా సంస్థ ల వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయనకు ఆంధ్ర రత్న గౌరవ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా ఆయన 24వ ఆత్మీయ ప్రధానోత్సవాల పురస్కారాలకు వెళ్లి తెలుగు భాషాభివృద్ధికి, విద్యార్థులలో వికాసం, వ్యక్తిత్వం, జాతీయ సమైక్యత, రాజకీయ లక్షణాలపై తన ఉపన్యాసాలతో ఉత్ప్రే ప్రేరణ కలిగించిన నేపథ్యంలో ఆంధ్ర రత్న గౌరవ పురస్కార సన్మానం అందుకొని సన్మానించబడ్డాడు. అద్భుతమైన ప్రసంగం చేయడం జరిగింది. మన దేశ సంస్కృతిలో తెలుగు నేలకు ఎంతో గొప్పతనం ఉందంటూ ప్రసంగించాడు. కన్నడ సినీ నటి పంకజ మాట్లాడుతూ ఇలాంటి ప్రసంగాల వల్ల కలలను పెంపొందించుకోవాలన్నారు. విజయవాడ కార్పొరేటర్ సునీత, రాజమండ్రి కి చెందిన సత్యనారాయణ, విజయ్ కుమార్ తదితరులు సమావేశంలో ప్రసంగించారు. ప్రతిభ పాటవాలు కలిగిన 26 మంది కళాకారులను జ్ఞాపికలతో, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో హాజరైన ప్రేక్షకులకు ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి.
-
Y.Bala guru natha sarma , Vontimitta kadapa District devotional writings
View all posts
Thanks for your feedback!