కోడి గాండ్ల పల్లె గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండలం కోడిగాండ్లపల్లి, కమ్మవారిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఏ డి ఏ వి. వెంకటసుబ్బయ్య పాల్గొన్నట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎడి ఏ మాట్లాడుతూ ప్రతి రైతు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొని పథకాల గురించి అవగాహన పొందాలని కోరారు.తదుపరి వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ పొలము పిలుస్తోంది కార్యక్రమం లో రైతులు విరివిగా పాల్గొని అన్ని విధాలా సూచనలు సలహాలు పొంది తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించి అధిక ఆదాయం పొందాలని కోరారు.రైతులు విత్తనశుద్ది గురించి అవగాహన పొంది విత్తనశుద్ది తప్పనిసరిగా పాటించాలి అని కోరారు.రభి లో సాగు చేసే పంటలకు త్వరలోనే పంట బీమా రైతులు చేసుకోవచ్చును అని తెలిపారు.ఆయా పంటల వారీగా ప్రీమియం చెల్లింపు వివరాలు రైతులకు తెలియ చేస్తామని తెలిపారు. ప్రతి రైతు పంటల బీమా గురించి అవగాహన పొంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉద్యాన సహాయకురాలు యమ్.రాధ, మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.