కరవు మండలాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

కరవు మండలాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఖరీఫ్ సీజన్‌- 2024 కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. నైరుతీ రుతుపవనాల సీజన్‌లో కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించిన 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా ప్రకటిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనా కొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లు సిసోడియా తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!