వీధిన పడిన నాలుగు కుటుంబాలు…
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల పరిధిలోని పెండేకల్ ఆర్ ఎస్ గ్రామంలో స్థానికంగా ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ప్రాంగాణంలో ఉన్న నాలుగు కుటుంబాలు దాదాపు 90 ఏళ్లుగా స్థిర నివాసం ఉంటూ జీవనం సాగించారు.నాలుగు కుటుంబాలకు చెందిన వారు జాలవాడి సునీత భర్త జాలవాడి ప్రసాద్. జాలావాడి ఆదిలక్ష్మి భర్త జాలవాడి నాగరాజు.జాలవాడి అంజలి భర్త ఆంజనేయులు. అంజలి భర్త గత రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. జాలవాడి నాగలక్ష్మి భర్త జాలవాడి బసవరాజు.గత కొంత కాలంగా భారతీయ రైల్వే అధికారులు గుత్తి రైల్వే జంక్షన్ నుంచి పెండేకల్ రైల్వే జంక్షన్ దాకా డబుల్ డబ్లింగ్ రైల్వే పనుల కోసం నిర్వహిస్తున్న తరుణంలో రైల్వే లైన్ కోసం సర్వే చేయగా ఎన్నో ఏళ్లుగా ఉన్న కొన్ని కుటుంబాలు వారి ఇల్లు స్థలాలు సర్వే ప్రకారం రైల్వే స్థలం లోకి వెళ్లినందున రైల్వే ఉన్నత అధికారులు శనివారం నవంబర్ 02.2024 న జెసిబి యంత్రాలతో స్థానికంగా నివాసం ఉన్న ఇళ్లను తొలగించడం జరిగింది.ఇళ్లను తొలగించడం వలన నాలుగు కుటుంబాలు వీధిన పడడంతో దిక్కు తోచన స్థితిలో ఉన్న కుటుంబాలు వారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్ధిక సాయం అందించి తమకు ఇళ్ల స్థలాలు కేటాయించగలరని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు.
గ్రామంలోని ప్రజలు పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం వారు పెద్ద మనసుతో రోడ్డున పడిన నాలుగు కుటుంబాల వారికి ప్రభుత్వం తరుపున ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఆర్ధిక సాయం అందించేలా చేయాలనీ తెలియజేశారు…