పెట్టుబడి సహాయాన్ని రైతులకు తక్షణమే అందించాలి

పెట్టుబడి సహాయాన్ని రైతులకు తక్షణమే అందించాలి

* పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలి.

* రబీ సీజన్ పంటల బీమాను ప్రభుత్వమే చెల్లించాలి.

తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రైతులకు పెట్టుబడి సహాయాన్ని తక్షణమే అందజేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రోజున మండల పరిధిలోని గల బొందిమడుగుల సచివాలయం నందు విలేజ్ సర్వేయర్ కృష్ణ నాయక్ కు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నాయకులు వినత పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తక్షణమే పెట్టుబడి సహాయం కింద 20000 రూపాయలను అందజేయాలని,రబీ సీజన్ కు సంబంధించి పంటల బీమాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని వారు తెలియజేశారు.అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను మరియు ప్రజలను ఆదుకోవాలని వారు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పలు జిల్లాలలో సజ్ ల పేరుతో పరిశ్రమలో మరియు ప్రాజెక్టుల కోసం రైతుల నుండి సేకరించిన భూములను తిరిగి రైతులకు అందజేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య, నాయకులు నాగరాజు,యలప్ప మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

0/400
Thanks for your feedback!