విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

క్రీడాకారులకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి రుణపడి ఉంటాం : జెట్టి.వేణుగోపాల్

ఆత్మకూరు, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల్లో ఇచ్చే నోటిఫికేషన్ లో G.O NO.MS 74 ప్రకారం అర్హులైన క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ దాన్ని 3 శాతానికి పెంచిన  ముఖ్యమంత్రి చంద్రబాబు  కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఆత్మకూరు పట్టణ టీడీపీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జెట్టి.వేణుగోపాల్, అబ్దుల్లాపురం బాషా తెలిపారు. శ్రీశైలం శాసనసభ్యులు .బుడ్డా రాజశేఖర్ రెడ్డి  ఆదేశానుసారం ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి గౌడ్ సెంటర్ వరకు డ్రమ్స్,టపాకాయలు పేలుస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల,ప్రగతి హైస్కూల్,పద్మావతి హైస్కూల్, నలంద హైస్కూల్,కస్తూర్బా హైస్కూల్ విద్యార్థులు,క్రీడాభిమానులు పాల్గొన్నారు. జెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నపాటి నుంచే చదువుతో పాటు క్రీడలను నేర్చుకొని ప్రతిభ చూపించి అర్హత పత్రాలు పొందడం వల్ల వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో క్రీడా కోట 3 శాతానికి అర్హులు అవుతారని ఉద్యోగం రావడం లో సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆత్మకూరు స్టేడియం లో అన్ని రకాల క్రీడలకు త్వరలో ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారని విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అబ్దుల్లాపురం బాషా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కేవలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి కే సాధ్యమన్నారు. ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పీల్ మున్నా మాట్లాడుతూ శ్రీశైలం MLA బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారి సహకారంతో నియోజకవర్గం లో స్టేడియం లో అన్ని రకాల క్రీడలను అభివృద్ధి చేస్తామని బీద క్రీడాకారులు ఎవరైనా ఉంటే తమను సంప్రదిస్తే వారికి కావలసిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు  శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి  ఫోటోలకు పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు ఆసిఫ్ బేగ్, మోటార్ షఫీవుల్లా,నాయభ్ సయ్యద్ అసదుల్లా,దేవానంద్,రామప్రసాద్ రెడ్డి,అల్తాఫ్ బియాబాని  అన్ని పాఠశాలల యాజమాన్యాలు,క్రీడా శిక్షకులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!