శిథిలావస్థలో తుగ్గలి బస్టాండ్
* రంద్రాలతో దర్శనం ఇస్తున్న బస్టాండ్ పైకప్పు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి:మండల కేంద్రంమైన తుగ్గలిలోని ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుంది.బస్టాండ్ నందు ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. బస్టాండ్ లో కనీసం కూర్చోవడానికి బెంచీలు కూడా లేకపోవడం గమనార్ధం. మండలంలోని ఆయా గ్రామాల నుంచి గిరిగెట్ల,అమీనాబాద్,పగిడిరాయి, కొత్తూరు తదితర గ్రామాల నుంచి చదువుకోవడానికి వచ్చిన పిల్లలు బస్టాండ్ లో కూర్చోవడానికి లేక బస్సులు వచ్చేదాకా నిలబడే వేచి చూడాలి.బస్టాండ్ పైకప్పు కూలిపోతున్నా కూడా పట్టించుకునే నాధుడే లేడు.బస్టాండ్ నందు చెత్త చెదారం పేరుకుపోవడంతో కుక్కలు, పందులు విరవిహారం చేస్తున్నాయి. గోడలకు పగుళ్లు ఏర్పడి ఎప్పుడు పడుతుందోనని ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. అయినా ప్రభుత్వ అధికారులు అటువైపు చూడకపోవడం గమనార్ధం. బస్టాండ్ ను వెంటనే బాగు చేయాలని, లేదంటే ప్రజల సమక్షంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని సిపిఎం మండల కన్వీనర్ శ్రీ రాములు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యుడు శ్రీనివాసులు,స్థానికులు దేవదాసు,ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.