ఆదమరిస్తే అంతే సంగతి..! సార్ జర చూడండి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; మోరగుడి గ్రామంలో మూడో వార్డు అంగన్వాడి స్కూల్ దగ్గర జియో టవర్స్ యజమాన్యం మరమ్మత్తులు చేస్తూ అలాగే వదిలి పెట్టారు. అక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగిన అంతే సంగతి, అక్కడ ట్రాన్స్ఫార్మర్, సిమెంట్ స్తంభం కింద పడే అవకాశం ఉంది. సిమెంట్ స్తంభం ఒరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ప్రాణ నష్టం జరగవచ్చు అని గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి పరిష్కారం చూపండి మహాప్రభువు అని మోరగుడి గ్రామ ప్రజలు అధికారులకు వేడుకుంటున్నారు.
Was this helpful?
Thanks for your feedback!