పోరాట యోధుడు భగవాన్ బిర్సా ముండా

పోరాట యోధుడు భగవాన్ బిర్సా ముండా

హోళగుంద,న్యూస్ వెలుగు: బ్రిటిషర్ల వలసవాదాన్ని ఎదుర్కొని దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు ఆదివాసుల అస్తిత్వం కోసం పోరాటం చేసి గిరిజన తెగల ప్రజల్లో రాజకీయ చైతన్యం నింపిన మహాన్ వ్యక్తి బిర్సా ముండా అని ఎంపిడిఓ విజయ లలిత,కార్యదర్శి రాజశేఖర్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక మేజర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన 150వ బిర్సా ముండా జయంతి సందర్భంగా జన జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమాన్ని మరియు ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాడిన యోధుడు భగవాన్ బిర్సా ముండా అన్నారు.అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన,షెడ్యూల్ తెగల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని ప్రతి గిరిజన కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.మరియు గిరిజనులు తమ పూర్వీకులు నుంచి అందిపుచ్చుకున్న వారసత్వ సంపద,సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లలను మంచిగా చదివించాలన్నారు.అనంతరం ఎరుకుల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రెండు ఎకరాల్లో ఈత చెట్టు పెంచి కుల వృత్తి పెంపొందించుకునేందుకు తోడ్పాటు అందించాలని మరియు తమ కాలనీల్లో సీసీ రోడ్డు,తమకు ఇళ్ళు మంజూరు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.మండలంలో గిరిజన సంక్షేమ హాస్టల్ ను ఏర్పాటు చేయాలన్నారు.ఈ ఎంఈఓ-1 సత్యనారాయణ, ఐసిడిఎస్ సూపర్ వైజర్ షీభా రాణి,ఎంజిఎన్ఆర్జిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ మంజునాథ్,ఎంపిటిసి మల్లయ్య,వార్డు సభ్యులు, ఎరుకుల సంఘం నాయకులు గాదిలింగప్ప,నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!