
ఉద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలి..!
కర్నూలు, న్యూస్ వెలుగు; ఏపీ వెలుగు విఓఏ ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. విఓఏ లకు 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరినప్పుడు ఉద్యోగులను తొలగించడం సరికాదని తమపై రాజకీయ వేధింపులు ఆపాలని కోరారు. విఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించి బాకాయి ఉన్న వేతనాలు చెల్లించాలన్నారు. అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు.
ఈకార్యక్రమంలో ఎపి వెలుగు విఏఓ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు.గుంటెన్న, సీఐటీయూ. జిల్లా కార్యదర్శి. అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!