కోటి 40 లక్షలు ప్రకటించిన ప్రవాస భారతీయులు

Kurnool (కర్నూలు):  ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి అమెరికాలో స్థిరపడిన  ప్రవాస భారతీయులు  తోడ్పాటు అంధించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభాకర రెడ్డి తెలిపారు.   ప్రవాస భారతీయులు తో మాట్లాడి  ఆయాన  ఆసుపత్రికి కావాల్సిన అభివృద్ధికి  తమ వంతు సహాయ సహకారలు కావాలని సూపరింటెండెంటు కోరినట్లు తెలిపారు. ఇందుకు స్పందించిన ప్రవాస భారతీయులు  కోటి 40 లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు  ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించగా…  డాక్టర్ సోమసుందరము ఆసుపత్రికి కోటి రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నిదులతో ఆసుపత్రి అభివృద్ది పనులు వేగం పుంజుకుంటాయన్నారు.  ఆసుపత్రికి కావలసిన  గైనిక్, పిల్లల వార్డు మరియు ఎమర్జెన్సీ విభాగంలో అత్యవసర చికిత్స రోగనిర్ధారణ చేసేందుకు అల్ట్రాసౌండ్ ఇతర వైద్య పరికరాలు ఇవ్వడానికి డాక్టర్ కృష్ణారెడ్డి  ముందుకు వచ్చినట్లు తెలిపారు. మరో  పూర్వ విద్యార్ధి..30 లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు రాగా .. ఆసుపత్రిలో  వైద్య పరికరాల కొరకు అల్ట్రా సౌండ్ మిషన్లు , ఇఎన్టి విభాగానికి ఎండోస్కోపీ పరికరాలు ఇస్తామన్నారు. ఇలా పూర్వ విద్యార్దులు రోగుల మెరుగైన వైద్యానికి సహకరించడం సంతోసించదగ్గ విషయమని  ఈ కార్యక్రమాన్ని  జూమ్ మీటింగ్లో డాక్టర్ కొప్పర్తి రామ్మోహన్ ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ సదాశివ రెడ్డి , డాక్టర్ రంగారెడ్డి , డాక్టర్ అనుపమ హెచ్ ఓ డి, డా.విజయ ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!