గండికోట లో అక్రమ టోల్ గేట్ వసూలు రద్దు చేయాలి; డివైఎఫ్ఐ
కడప, న్యూస్ వెలుగు; ప్రపంచ పర్యాటక కేంద్రం అయిన గండికోట లో గత కొద్ది నెలలుగా వసూలు చేస్తున్న అక్రమ టోల్ గేట్ వసూలు రద్దు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ తెలిపారు.సోమవారం నాడు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో గ్రీవెన్స్ లో డిఆర్ఓ విశ్వేశ్వర్ నాయుడు కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక కేంద్రం అయిన గండికోట ను చూడటానికి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు వస్తున్నారు అన్నారు. కానీ వచ్చిన పర్యాటకులకు టోల్ గేట్ ద్వారా గండికోట ఎంట్రీ లో టోల్ గేట్ పెట్టీ వ్యక్తికి ఒక రేటు,వాహనాలకు ఒక రేటు,సెలవు దినాలలో మరో రేటు పద్ధతిలో చార్జీలు వసూలు చేస్తున్నారు అన్నారు.రోజు వందల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు అన్నారు.వచ్చిన వారికి టోల్ గేట్ ద్వారా డబ్బు వసూలు చేయడంతో టూరిస్టులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అన్నారు.దీని ద్వారా సుదూర ప్రాంతాల నందు వచ్చి వారికి ఇబ్బంది కలుగుతుందని పిల్లల స్కూల్ బస్సులలో,ఇతర వాహనాలలో వచ్చే వారు మళ్ళీ రావాలంటే ఆలోచనలో పడుతున్నారు అన్నారు.దీని ద్వారా పర్యాటకులు రాకపోకలు తగ్గే ప్రమాదం వుంది అన్నారు.ఎక్కడా లేని విధంగా ఇక్కడ వసూలు చేయడం విడ్డూరంగా వుంది అన్నారు. అంతే కాకుండా అధికారులు కోట అభివృద్ధి కి వసూలు చేస్తున్నాము అన్నారు.కానీ పురావస్తు శాఖకు సంభందించిన కోట కు రాష్ట్ర టూరిజం వాళ్ళు వసూలు మరి విడ్డూరం గా వుంది అన్నారు.ఇలా వసూలు చేయాలని జివొ ఇచ్చారా,కనీసం వ్రాతపూర్వకంగా అయిన రాసుకున్నారా,లేక నోటి మాట ద్వారా వసూలు చేస్తున్నారా అన్నది ఒక ప్రశ్నలాగా మిగిలిపోయింది అన్నారు. సాధారణ మామూలు టికెట్ల ఇవ్వడం జరుగుతుందని అన్నారు.పోనీ కోట లో అభివృద్ధి పనులు జరిగాయా అంటే అది లేదు.టాయిలెట్లు లేవు,మంచి నీటి సౌకర్యం లేదు,పర్యాటకులు కూర్చోవడానికి సాండ్ లు లేవు అన్నారు.వసూలు చేసిన డబ్బుతో ఉద్యోగాలు ఏ ప్రాతిపదికన ఇచ్చి జీతాలు ఇస్తున్నారు అన్నారు.అధికారికంగా ఉద్యోగులను నియమించరా,లేక అనధికారికంగా పెట్టారా అన్నది ప్రశ్నే అన్నారు.అధికారులు గ్రామ అభివృద్ధికి వసూలు చేస్తున్నాము అంటున్నారు.కోట పేరు చెప్పి గ్రామానికి డబ్బులు వసుకు పర్యాటకులతో చేయడం దారుణం అన్నారు. గ్రామ అభివృద్ధికి పాటుపడాలంటే నిధులు కావాలంటే గ్రామపంచాయతీ నిధులు ఖర్చు చేయాలి గాని ఇలా పర్యాటకులతో డబ్బులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు.కావున ప్రజల వద్ద నుండి టోల్ గేటు ద్వారా చేసే వసూలు ను రద్దు చేయాలని లేకుంటే భవిష్యత్ లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పర్యాటకులతో కలిసి ఆందోళన చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో నాయకులు నిర్మల్ పాల్గొన్నారు.