ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

హొళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో మంగళవారం మేజర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో కార్యదర్శి రాజశేఖర్,సర్పంచ్ తనయుడు పంపాపతి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ముందుగా భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ నిర్దేశకత్వంలో 1949లో ఇదే రోజున రాజ్యాంగం సిద్ధమైందని చెప్పారు.ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచిందన్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు,విధులను కూడా అనుసరిస్తూ జీవించడం మన బాధ్యతగా భావించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది,పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!