కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన అజెండా

కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన అజెండా

 పగిడిరాయి గ్రామంలో టిడిపి సభ్యత నమోదు కార్యక్రమం

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన అజెండా అని పగిడిరాయి గ్రామ టిడిపి నాయకులు తెలియజేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదుతో ప్రతి కార్యకర్త కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుందని పగిడిరాయి గ్రామ టిడిపి నాయకులు ఈశ్వర్ రెడ్డి,టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు లు తెలియజేశారు.ఈ సందర్భంగా బుదవారం రోజున పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ శాంబాబు ఆదేశాల మేరకు పగిడిరాయి, బోల్లవానిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని గ్రామ టిడిపి నాయకులు ప్రారంభించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముందుచూపుతో రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల మరియు కార్యకర్తల సంక్షేమం కొరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని వారు తెలియజేశారు.ప్రతి కార్యకర్త వంద రూపాయల సభ్యత్వ నమోదుతో ప్రతి కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు తెలుగుదేశం పార్టీ ఆర్థిక భరోసాను కల్పిస్తుందని వారు తెలియజేశారు.కావున 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తప్పకుండా తీసుకోవాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డీలర్ సుంకన్న,మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ నాగార్జున,ఫీల్డ్ అసిస్టెంట్ రాము, రంగారెడ్డి,అడ్వకేట్ బాలభాష, పగిడిరాయి,బోల్లవానిపల్లె గ్రామ టిడిపి నాయకులు,కార్యకర్తలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!