పార్లమెంటు సమావేశాలలో కడప ఉక్కు పై చర్చించాలి; డివైఎఫ్ఐ
యర్రగుంట్ల, న్యూస్ వెలుగు; ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో విభజన హామీలలో భాగమైన కడప ఉక్కు పై చర్చ జరపాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ తెలిపారు.ఎర్రగుంట్ల లో స్థానిక ఐటిఐ నందు విలేఖరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు పై నిర్లక్ష్యం వహిస్తున్నది అన్నారు.విభజన హామీలలో భాగమైన కడప ఉక్కు పై ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు నిర్మించలేదు అని ప్రశ్నించారు.వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో చదువుకున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక గల్ఫ్ లాంటి దేశాలకు వలసలు పోతున్నారు.మరికొందరు ఇతర రాష్ట్రాలలో పనులకు వెళుతున్నారు అన్నారు.కరువుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతంలో ఉపాధి పరిశ్రమలు చాలా అవసరం అన్నారు.అందులో ఉక్కు పరిశ్రమ లాంటి భారీ పరిశ్రమ వస్తే ఎక్కువ సంఖ్యలో యువతకు ఉపాధి లభించే అవకాశం వుంటుంది.కానీ అన్నీ వున్న అల్లుడి నోట్లో శని అన్న చందండ కడప ఉక్కు పరిశ్రమ పరిస్థితి తయారైంది అన్నారు.ముఖ్యమంత్రులు అందరూ రాయలసీమ ప్రాంత వాసులేనని ముఖ్యమంత్రులు మారుతున్న,వాళ్ళు వేసిన శిలాఫలకాలు మారుతున్న కడప ఉక్కు పునాది రాయి ముందుకు కదలడం లేదన్నారు. శిలాఫలకాలు సమాధిరాళ్ళ లెక్క వెక్కిరిస్తున్నాయి అన్నారు.గడిచిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం కడప ఉక్కు కు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోంది అన్నారు.మన రాష్ట్ర,ప్రాంత ఎంపీలు ప్రాంత భవిష్యత్ కోసం,యువతకు ఉపాధి కోసం పార్లమెంటులో గలమెత్తాలి అన్నారు.కేంద్రం పై ఒత్తిడి తెచ్చి కడప ఉక్కు కు నిధులు సాధించాలని అన్నారు.లేకుంటే ఇక్కడి ప్రాంత యువత,ప్రజలు క్షమించరు అన్నారు.సమావేశంలో ఎర్రగుంట్ల నాయకులు సాయిప్రశాంత్,నరేంద్ర,చంద్రశేఖర్ పాల్గొన్నారు.