యువ ఇంజనీర్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి : హుస్సేనప్ప
Kurnool ( కుర్నూల్ ) : ఆంధ్రప్రదేశ్ లోని ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనారిటీ నిరుద్యోగులైన ఎంటెక్ , బీటెక్, డిప్లమో, సివిల్ చదువుకున్న యువతకు 50 లక్షల రూపాయల వరకు సివిల్ వర్క్స్ నామినేషన్ పద్ధతిలో కేటాయించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలె) ఆంధ్ర ప్రదేశ్ ఉపద్యక్షులు హుశసేనప్ప మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా చేసే పనుల్లో ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకు నామినేషన్ పద్ధతి ద్వారా టెండర్లలో ప్రత్యేకంగా రిజర్వ్ చేసి వారికే కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు .
వారందరికీ ప్రభుత్వం కాంట్రాక్టర్ లైసెన్స్ ఇచ్చి , వర్క్ ఆర్డర్ మీద 70 శాతం బ్యాంకు లోన్ సౌకర్యం కల్పించాలన్నారు. ఎస్టిమేట్లో కాంట్రాక్టర్ ఆదాయాన్ని 14 శాతం నుండి 25 శాతానికి పెంచాలన్నారు. వర్క్ చేసిన తర్వాత ఆ బిల్లును అప్పు ఇచ్చిన బ్యాంకుకు పంపాలన్నారు. బ్యాంకు తాను ఇచ్చిన అప్పు చెల్లించుకొని మిగిలిన మొత్తాన్ని కాంట్రాక్టర్కు ఇవ్వాలని సూచించారు. ఈఎండి ల్లో మినహాయింపు , నిర్మాణ సామగ్రి , జెసిబిలు, హిటాచీలు, కాంక్రీట్ మిక్సర్స్, అజాక్స్ , సెంట్రింగ్ సీట్లు మొదలగు వాటిని ప్రభుత్వమే సబ్సిడీతో మంజూరు చేయాలన్నారు. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల అభివృద్ధికి చర్యలు తీసుకునేలా దృష్టిసరించాలని ఆర్పిఐ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఎన్ డి ఎఫ్ కన్వీనర్ హుస్సేన్ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు.