రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా రగ్బీ క్రీడాకారులు
న్యూస్ వెలుగు, కర్నూలు. స్పోర్ట్స్ ; డిసెంబర్ ఒకటో తేదీన నెల్లూరు జిల్లా కావలిలో జరిగే రెండవ రాష్ట్రస్థాయి రగ్బీ యూనయన్ మినీ సబ్ జూనియర్ అండర్- 12 ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే కర్నూలు జట్టును ఆ జిల్లా సంఘం కార్యదర్శి రామాంజనేయులు ప్రకటించారు.
స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పోటీల్లో రాణించి పతకాలతో జిల్లాకు తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రగ్బీ ప్రతినిధులు మహబూబ్ సుభాని, రమ్య సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!