గ్రామీణ ప్రాంతంలో పేదలకు మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి ; సిపిఐ
న్యూస్ వెలుగు, కర్నూలు; గ్రామీణ ప్రాంతాల్లోబి పేదలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని, పేదల ఇల్లు నిర్మించుకోవడానికి సిమెంటు స్టీలు ఇటికలు గృహ నిర్మాణానికి ఉచితంగా ఇవ్వాలని పేదలు నివసిస్తున్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మరియు పెండింగ్ లో ఉన్న ప్రజా నగర్ టీవీ9 కాలనీలో ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ని సచివాలయాల దగ్గర అధికారులను కలిసి ప్రజలను తోడుకొని పోయి ప్రజల చేత ఇంటి స్థలం కోసం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సుమారు ఈ ఏరియాలలో వేల కుటుంబాలు ఉన్నారు అని రోజా వీధి సచివాలయం ప్రకాష్ నగర్ నగర్ N.R.పేట సచివాలయం 39/125&126 47/127&124దీన్నే దేవరపాడు సచివాలయం మరియు టీవీ9 కాదాంబరి సచివాలయం లో మొదలగు సచివాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. ప్రకాష్ నగర్ శాఖ సెక్రెటరీ ఖాదర్ బాషా అధ్యక్షతన జరిగింది అలాగే టీవీ9 కాదాంబరి సచివాలయంలో ముఖ్య అతిథులుగా కర్నూలు భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ నగర సహాయ కార్యదర్శి దంభోళo శ్రీనివాసరావు. వివిధసచివాలయల్లో కొన్నిచోట్ల సెక్రెటరీ వారికి మరియు V.R.0 సంబంధిత అధికారులకు ఒక జట్టు వర్షం పడుతున్న మహిళలు ఇబ్బంది పడకుండా వచ్చారని పేద ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఉండడానికి ఇల్లు లేక ఇంటి నెలసరి అద్దె కడుతూ ఇబ్బంది పడుతున్నారాని ఇంటి స్థలాల కోసం తెచ్చిన అప్లికేషన్లు అధికారులకు ఇచ్చి పై విషయాలను వివరించి విన్నవించుకోవడం జరిగింది. కార్యక్రమంలో రాముడు నౌషద్ బేగం పద్మ లక్ష్మీదేవి అఖిల్ జగన్ తిరుపాలు నీలమ్మ జహీరాబాద్ సుజాత జయమ్మ భాయ్ శాలిమా బి నసీమా సలీమా రేష్మ భాను అశోకు ఏసు ఆశ, టీజీవి కాలనీ శాఖ కార్యదర్శి C.మునెమ్మ లబ్ధిదారులు,తదితరులు పాల్గొన్నారు.