నిరుద్యోగి..
ఆకాశాన్నంటే ఆశలు,
అవనిపై అస్థిరమైన బతుకులు.
చాలీ చాలని జీతాలు,
ఎంత కష్టపడిన ఎదగని జీవితాలు.
అలలై పొంగే ఆశలతో,
ప్రయత్నమే జీవితమని,
అలుపెరుగక అహర్నిశలూ శ్రమిస్తూ,
జీవితాన్ని అనునిత్యము నిందిస్తూ,
నిరాశను నిరంతరం నిలదీస్తూ,
బతకలేక బతుకీడుస్తూ,
మోడుబారిన జీవితంలో,
చిగురిస్తున్న ఆశలతో,
ఎన్నాళ్ళీ నిరీక్షణ?
ఓ నిరుద్యోగీ!
నీలో ఉద్వేగా లెన్నున్నా,
నీకు కావలసిందొక ఉద్యోగం.
ప్రయత్నం ఆశాకిరణమై ఉదయించి,
ఆశయాన్ని గుర్తు చేయదా…
అంధకారాన్ని అంతం చేసే రవికిరణం
పొద్దు పొడుపై తూర్పున ఉదయించదా…
శ్రమ నీకు ఆయుధమైతే,
విజయం నీకు బానిస.
✍.. దుంపాల వీరేష
Was this helpful?
Thanks for your feedback!