చిన్న కోత గుండె ఆపరేషన్- MICS-ఉచితంగా గుండె లో రంధ్రంనకు అధునాతన చికిత్స 

చిన్న కోత గుండె ఆపరేషన్- MICS-ఉచితంగా గుండె లో రంధ్రంనకు అధునాతన చికిత్స 

న్యూస్ వెలుగు, కర్నూలు హాస్పిటల్; వారం క్రితం హైదరాబాద్ లోని షెరటాన్ హోటల్లో MICS మరియు రోబోటిక్ ఆపరేషన్ లో మెలకువలు నేర్చుకోవడానికి అటెండ్ కావడం జరిగింది.. అందులోనే సారాంశాన్ని ఇంకొంచెం బాగా ఉపయోగిస్తూ ఈరోజు ఒక ఎం ఐ సి ఎస్ ఆపరేషన్ చేయడం జరిగింది.
ఖాజా భాషా అనే 13 సంవత్సరాల వయసు గల బాలుడు, మిట్టకందాల గ్రామం, పాములపాడు మండలం, నంద్యాల నుంచి గుండెకు రంధ్రం ఉందని కార్డియాలజీ నుంచి మా దగ్గరికి వచ్చాడు..ఈ అబ్బాయికి గుండెలో హోల్ ఉంది. మామూలుగా అయితే స్టెర్నం బోన్ కట్ చేసి చేయడం వలన దాదాపు పెద్దగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.. అంతేకాకుండా బోన్ కూడా కట్ చేయాల్సి వస్తుంది.. ఆపరేషన్ లో రక్తం ఉపయోగం ఎక్కువగా ఉంటుంది మరియు రికవరీ లేటుగా ఉంటుంది.. మరల తన పనులు చేసుకోవడానికి ఈ ఎముక మానేంతవరకు కూడా కష్టంగా ఉంటుంది..ఈ చిన్న కోత ఆపరేషన్ చేయడం వలన ఎముక కట్ చేసే పని ఉండదు.. చాతి పక్కలో ఒక 6 ఆరు సెంటీమీటర్ల ఇన్సిషన్ ఇచ్చి మనము కిటికీలోంచి చూసినట్లు లోపలికి చూస్తూ ఆపరేషన్ చేయవచ్చు.. ఈ ఆపరేషన్ ఉదయం 10-2 మధ్యలో అయిపోతే సాయంత్రం 4 కు వెంటిలేటర్ ను తొలగించాము.. రక్తం అవసరం తక్కువ.. 3 -4 రోజులలో డిశ్చార్జి చేయచ్చు.. నెల తరువాత అన్ని పనులు చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్ హైదరాబాద్ బెంగళూరు లాంటి కార్పొరేట్ ఆసుపత్రులలో మాత్రమే చేస్తారు దీనికి 6 నుంచి 8 లక్షలు చార్జి చేస్తారు.. ఇన్సూరెన్స్ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ ఛార్జి ఉంటుంది.. మేము ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూల్ లో దీనిని ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎటువంటి చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా చేయడం జరిగింది..
చిన్నపిల్లవాడు కదా ఎదిగే వయసు కావున చాలా కంఫర్టబుల్గా ఉంటుంది.. ఈ ఆపరేషన్ పెళ్లి ఆడపిల్లలకు కూడా కాస్మెటిక్గా చాలా బాగా ఉంటుంది.. దీనిని సినిమా యాక్టర్లు అటువంటి వాళ్ళ కోసం మొదట కనిపెట్టారు..
ఇటువంటి చిన్న కోత ఆపరేషన్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాత్రమే ప్రభుత్వాసుపత్రిలలో చేయడం జరుగుతుంది… ఇంతవరకు 60 ఆపరేషన్లు వరకు వివిధ రకాల ఆపరేషన్లు ASD, MVR, AVR, DVR, MIDCABG చేయడం జరిగింది..ఈ ఆపరేషన్ లో డాక్టర్ కొండారెడ్డి మత్తు మందు నిపుణులు, డాక్టర్ రవీంద్ర, రమేష్ పెర్ఫ్యూజినిస్ట్ మరియు ఇతర ఆసుపత్రి సిబ్బంది సిటివిఎస్ CTVS విభాగంలో పనిచేసే వాళ్లు పాల్గొనడం జరిగింది.. ఇదంతా ఓ పెద్ద టీమ్ వర్క్.. ఆపరేషన్ సక్సెస్ గా జరిగేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.. కార్డియాలజీ డిపార్ట్మెంట్ వైద్యులకు ప్రత్యేక అభినందనలు..డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh గుండె , ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు.

Author

Was this helpful?

Thanks for your feedback!