
ఎవరికీ అవసరంలేని ప్రాంతంలో స్థానిక ప్రజలకు తెలియకుండా నివాస భవనాలపై 60 అడుగుల రోడ్డా..?
రూపాయి రూపాయి కూడ బెట్టుకొని 20,30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇండ్ల కూలగొడతారా..?
కర్నూలు, న్యూస్ వెలుగు; ఎవరికి అవసరం లేని ప్రాంతంలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర నివాస భవనాలపై మంజూరైన 60 అడుగుల రోడ్డును రద్దు చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు కే వరప్రసాద్, జి పుల్లారెడ్డి నగరపాలక సమస్త కమిషనర్ ను కోరారు . 5 కాలనీల నివాస భవనాలపై మంజూరైన 60 అడుగుల రోడ్డును వెంటనే రద్దు చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో కాలనీ ప్రజలు నగరపాలక సంస్థ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమనగర్,లక్ష్మి కాలనీ, పోస్టల్ కాలనీ,కోట్ల నగర్,బాలాజీ నగర్ లలొ రూపాయి రూపాయి కూడ బెట్టుకొని 20, 30 ఏళ్ల క్రితం పేద మధ్యతరగతి ప్రజలు ఇల్లు నిర్మించుకున్నారన్నారన్నారు. 5 కాలనీలలో రోడ్లు భవనాల ఫోటోలను కమిషనర్ గారికి చూపించారు. ఈ ప్రాంతంలో జనసంచారం కూడా చాలా తక్కువగా ఉంటుందన్నారు.60 అడుగుల రోడ్డు ఎవరికి ఉపయోగపడదని, ఉదయం సాయంత్రం మినహా మిగతా సమయంలో గంటకు 10 మంది కూడా ఆ రోడ్లపై తిరిగే పరిస్థితి లేదన్నారు. గతంలో ఉన్న 40, 60 అడుగుల రోడ్లను కాపాడలేక అవసరంలేని నివాస ప్రాంతాలపై 60 అడుగుల రోడ్డును ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. గతేడాది ఫిబ్రవరిలో మంజూరైన 60 అడుగుల జీవోను రద్దు చేయాలని కమిషనర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఇ వి రమణయ్య,రెడ్డి శేఖర్ రెడ్డి,మహబూబ్ బాషా, రాజేశ్వర్ రెడ్డి,మహమ్మద్ యూనుస్, వెంకటేశ్వర్లు,రమణ గౌడ్,అన్వర్ భాష, లక్ష్మీనారాయణ,హరి కిషన్,సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.