
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు…
మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా శనివారం రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు పత్తికొండ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. కావున ఈ కార్యక్రమంలో తుగ్గలి మండల పరిధిలోని గల రాష్ట్ర పార్టీ బాధ్యులు,జిల్లా పార్టీ బాధ్యులు, మండల పార్టీ బాధ్యులు,ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు ప్రజాసంఘాల నాయకులు,భూత్ ఇన్చార్జిలు,యూనిట్ ఇన్చార్జులు,క్లస్టర్ ఇంచార్జిలు,ఎన్టీ రామారావు అభిమానులు,పార్టీ సానుభూతిపరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన తెలియజేశారు.