FlatNews Buy Now
రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి: రాయలసీమ విద్యార్థి పోరాట సమితి

రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి: రాయలసీమ విద్యార్థి పోరాట సమితి

కర్నూలు ( న్యూస్ వెలుగు ):   జిల్లాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా జిల్లాకు విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చం నాయుడు,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్,కర్నూల్ పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజులను నగరంలోని స్థానిక ఎంపీ కార్యాలయంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్,రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాదాసికురువ సుంకన్నలు కలిసి రాయలసీమ ప్రధాన సమస్యలపై వారికి వినతి పత్రం సమర్పించి ఈ నెల 16న జిల్లాకు రానున్న   ప్రధాని నరేంద్ర మోడీతో రాయలసీమ మరియు అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లా సమస్యలపై చర్చించాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించేలా చూడాలనికోరారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండ్రేవుల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి తక్షణమే నిర్మాణం చేపట్టాలని,శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని,ఓర్వకల్లు ప్రాంతంలో గ్రీన్ కో పరిశ్రమల హబ్ కొరకు మూడు టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం వెంటనే చేపట్టాలని,రాయలసీమ కరువు,వలసల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని,రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమ ప్రాంతానికి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,కృష్ణానది యాజమాన్య బోర్డును రాయలసీమ కర్నూలులో ఏర్పాటు చేయాలని,హైకోర్టు నిర్మాణం వెంటనే ప్రారంభించాలని,సిద్దేశ్వరం అలుగు,వేదవతి,ఆర్డీఎస్ తగిన ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టాలని,హంద్రీనీవా కాలువ వెడల్పు చేసి చిత్తూరు జిల్లాకు నీళ్లు అందించాలని,కేంద్ర ప్రభుత్వం రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ఈ సమస్యలన్నీటిపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి రాయలసీమకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు, ఈ సందర్భంగా మంత్రివర్యులు అచ్చం నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్,ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ పులికనుమ ప్రాజెక్టును తామే చేపట్టామని కర్నూల్ జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతున్నామని ఓర్వకల్ వద్ద అనేక పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని భవిష్యత్తులో తప్పకుండా రాయలసీమ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సమితి నాయకులు మదాసి కురువ భరత్ కుమార్,కె రాము,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

  • రాయలసీమ సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించాలి

  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీతో చర్చించి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించేలా చూడాలి.

  • గుండ్రేవుల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మాణం చేపట్టాలి

  • శ్రీభాగ్ ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలి

  • విభజన చట్టంలో కేంద్రం రాయలసీమకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూడాలి

  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజారపు అచ్చం నాయుడు,తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్,కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజును కలిసి వినతిపత్రం సమర్పించిన ఆర్వీపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS