
రాష్ట్ర స్థాయి జూడో క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన రాంపల్లి విద్యార్థి వాసు
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని రాంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన చిన్న హోతురు విజయలక్ష్మి,చిన్న హోతూరు విష్ణు దంపతులకు జన్మించిన చిన్న హోతూరు వాసు అనే విద్యార్థి తన తండ్రి చిన్న తనంలోనే చనిపోవడంతో, తన తండ్రి చనిపోయి దాదాపు ఎనిమిది సంవత్సరాలవడంతో తన తల్లీ కూలీ నాలీ చేసుకుని,పరాయి జిల్లాలకు వలసలు వెళ్లి జీవనం సాగిస్తూ నిరుపేదరికం అనుభవిస్తూ తన కుమారుడుని నందికొట్కూరు పరిధిలోని జూపాడుబంగ్లా గ్రామంలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యను అభ్యసిస్తూ పాఠశాల పిజికల్ డైరెక్టర్ వారి శిక్షణలో నిమగ్నమై మంచి నైపుణ్యం కనబరుస్తుండడంతో విద్యార్థి ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయిలో తిరుపతిలో జరుగుతున్న అండర్ 14 జూడో క్రీడలలో ప్రత్యర్తిని ఓడించడంతో చిన్న హోతూరు వాసుకి క్రీడా పెద్దలు గోల్డ్ మెడల్ బహుకరించడం జరిగింది. ఈ సందర్బంగా రాంపల్లి గ్రామానికి చెందిన కాలనీ పెద్దలు,యువతీ యువకులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసి మున్ముందుకు ఇంకా పట్టుదలతో కృషి చేసి మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో రాంపల్లి ఎస్సి కాలనీ పెద్దలు,యువతీ యువకులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.