వార్డెన్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి

వార్డెన్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి

నంద్యాల, న్యూస్ వెలుగు; ఎన్ఎస్ యు ఐ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డిఆర్ఓ  డిఇఓ

కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధోని రాజు యాదవ్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్ నంద్యాల జిల్లా కార్యదర్శి బత్తిని ప్రతాప్ వారు మాట్లాడుతూ డోన్ లోని ప్రభుత్వ బిసి బాలికల వసిటి గృహంలో 380 మందిపైగా విద్యార్థినిలతో ఉండటం వలన కొంతమంది వార్డెన్లు దుర్బుద్ధితో తమ డివిజన్ పరిధిలో లేకున్నా నందికొట్కూరు బీసీ బాలికల వసతి గృహం వార్డెన్  డిప్యూటేషన్ పై డోన్ కు రావడానికి నందికొట్కూరు ఎమ్మెల్యే గారికి తప్పుడు సమాచారం ఇచ్చి రికమండేషన్ లెటర్ తీసుకోవడమే కాకుండా, జిల్లా కలెక్టర్ కి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి డోన్ కు డిప్యూటేషన్ పై రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే ఇటువంటివారు రావడం వల్ల విద్యార్థుల పట్ల ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తారని, నందికొట్కూరులో బీసీ బాలికల హాస్టలను మూసివేసినట్లే డోన్ బాలికల వసతి గృహాన్ని కూడా మూసివేసే దిశగా తీసుకెళ్తారని వారు ఆవేదన వ్యక్తం చేశారు..
ముందుగా నందికొట్కూరు బీసీ బాలికల వసతి గృహాన్ని అభివృద్ధి చేయకుండా మూసి వేయడంపై సమగ్ర విచారణ జరిపి వార్డెన్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు.

అనంతరం నంద్యాల జిల్లా విద్యాధికారి జనార్దన్ రెడ్డి ని కలిసి కొన్ని ప్రైవేట్  కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా, విద్యార్థుల హక్కులను కాలరాస్తూ సెలవుల దినాలలో కూడా పాఠశాలల్లో తరగతు నిర్వహిస్తున్నారని నంద్యాల జిల్లా విద్య అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. విద్యార్థులకు ఏమాత్రం విశ్రాంతి ఇవ్వకుండా వారిని శారీరకంగా , మానసికంగా హింసిస్తున్నారని అయితే ఒత్తిడికి లోనైనటువంటి విద్యార్థులు చెడు వ్యసనాలకు, చెడు ఆలోచనలకు లోనై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఇప్పటికైనా విద్యార్థుల పట్ల వారి జీవితాల పట్ల ప్రైవేట్  కార్పొరేట్ విద్యాసంస్థలు ఆలోచించాలని లేనిపక్షంలో అట్టి విద్యాసంస్థలపై ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు..

Author

Was this helpful?

Thanks for your feedback!