
ఆదోని జిల్లాగా ప్రకటించాలి…
రాయలసీమ రవికుమార్రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్.
కర్నూలు, న్యూస్ వెలుగు: జిల్లాకు కావలసిన అన్ని అర్హతలు ఉన్న ఆదోనిని తక్షణమే ప్రభుత్వం జిల్లాగా ప్రకటించాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్,రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మదాసికురువ సుంకన్న,రాయలసీమ యువ విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షులు రంగముని నాయుడు అన్నారు. నగరంలోని స్థానిక ఆర్విపిఎస్ కార్యాలయం ఆవరణలో వారు మాట్లాడుతూ వ్యాపార రంగంలో రెండవ ముంబైగా పేరుగాంచి రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమై ప్రస్తుతం కరువు వలసలతో సతమవుతమవుతున్న కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని కేంద్రంగా చేసి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని వారు అన్నారు.ఆదోని ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉందని కర్నూలు జిల్లా కేంద్రానికి ఆదోని మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చేరుకోవాలంటే వందకు పైగా కిలోమీటర్ల దూరం ఉందని కలెక్టర్ కార్యాలయం లేదా వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజలు వారి పనుల నిమిత్తం కర్నూలు రావాలంటే ఎన్నో వ్యయప్రాయసలతో కూడిన వ్యవహారమని ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం తక్షణమే ఆదోనిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని
జిల్లాగా చేయాలని కోరుతూ స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారని ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి ప్రజల అభిప్రాయాల మేరకు వెంటనే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు రాము,రాజేంద్రప్రసాద్,భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

