కొత్తచెరువు న్యూస్ వెలుగు :

మండల కేంద్రంలోని కరెంట్ ఆఫీసు ని బిసి కాలని వాసులు శుక్రవారం ముట్టడించారు. వివరాలలోకి వెళ్తే గత కొన్ని నెలలుగా బిసి కాలనీ వాసులు అంధకారంలో బ్రతుకుతున్నారు.పలు మార్లు ఏఈ వెంకటేష్ నాయక్ మొరమెట్టుకున్న ఆయన మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. విసుగు చెందిన ప్రజలు కరెంట్ ఆఫీసు నందు ధర్నా కి దిగారు. చెరవాణి లో ఏడీ రామిరెడ్డి కి సమాచారం ఇవ్వగా ఆయన

సమాచారం అందిన వెంటనే కొత్త చెరువు సబ్ స్టేషన్ కి చేరుకొని బిసి కాలనీ వాసుల సమస్యలు తెలుసుకొని సిబ్బంది తో పాటి ఆయన కూడా ట్రాన్స్ ఫార్మర్ ఉన్న చోటుని పరిశీలించి తక్షణమే ఇంకొక ట్రాన్స్ ఫార్మర్ నీ అమర్చాలని సిబ్బంది కి తెలిపారు. మా సమస్య పై సత్వరమే స్పందించిన ఏడీ రామిరెడ్డి కి కాలని వాసులు ధన్యవాదాలు తెలిపారు.
Thanks for your feedback!