తొమ్మిది రంగాల్లో కుదిరిన ఒప్పందం
Delhi (ఢిల్లీ ): కస్టమ్స్, వ్యవసాయం, చట్టపరమైన, రేడియో మరియు టెలివిజన్ ప్రసారం, సంస్కృతి మరియు పర్యాటక రంగాలలో సమగ్ర వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం మరియు వియత్నాం తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తూర్పు కార్యదర్శి జైదీప్ మజుందార్ న్యూఢిల్లీలో తెలిపారు. వియత్నాం ప్రధాని ఫామ్‌మిన్ చిన్ భారత పర్యటనపై మీడియాకు వివరించారు. న్యూఢిల్లీలో వియత్నాం ప్రధాని ఫామ్‌మిన్ చిన్‌తో ప్రధాని మోదీ చర్చలు జరిపారని చెప్పారు. ఆర్థిక, వ్యూహాత్మక, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం ద్వారా భారత్-వియత్నాం బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఇరువురు నేతలూ అంగీకరించారని ఆయన చెప్పారు. వియత్నాం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, భారత్-వియత్నాం ద్వైపాక్షిక వాణిజ్యం 15 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుందని ఆయన అన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలకు అవకాశం అన్నారు.