అంబరం… పెద్ద గౌరమ్మ పండుగ సంబరం…

అంబరం… పెద్ద గౌరమ్మ పండుగ సంబరం…

భక్తిశ్రద్ధలతో గౌరిమాతకు విశేష పూజాలు
సాయంత్రం మహిళలతో కిటకిటలాడిన ఆలయాలు
చక్కెర హారతులు,పూలు కొనుగోలకు బారులు తీరిన ప్రజలు.
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శనివారం పెద్ద గౌరమ్మ పండుగ అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ప్రధానంగా ఈ పండుగ మహిళల ప్రాధాన్యతను సంతరించుకోవడంతో మహిళలను మెట్టినింటి నుంచి పుట్టింటికి పీల్చుకువచ్చి పిల్ల పాపలతో పండుగను సంతోషంగా జరుపుతున్నారు. ఉదయం నుంచి మహిళలు వివిధ ఆలయాల్లో కొలువైన అమ్మవారికి కుంకుమార్చన, ఆకుపూజ, పెద్ద ఎత్తున పూలమాలలతో అమ్మవారిని అలంకరించారు.మరియు పిల్లపాపలతో కలిసి ఆలయాలకు వెళ్ళి గౌరి మాతకు నోములు,పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు.అదేవిధంగా సాయంత్రం మహిళలు, చిన్నారులు కలిసి కట్టుగా కళశాలు,చక్కెర హారతులు చేత పట్టుకొని గౌరమ్మకు హారతి సమర్పించారు.దింతో ఆలయాలు మహిళలతో కిటకిటలాడాయి.పండుగ సందర్భంగా మండలంలో పూలు,చక్కెర హారతుల కొనుగోలు కోసం అంగడ్ల వద్ద ప్రజలు బారులు తీరారు. హొళగుంద బస్టాండ్ గౌరమ్మ పండుగ సందర్భంగా రెండు రోజుల నుంచి ప్రజలతో కిటకిటలాడింది.అలాగే యువకులు ఉల్లాసంగా,ఉత్సాహంగా ఆలయాల వద్ద టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మరియు రాత్రి అమ్మవారి విగ్రహ మూర్తిని చిన్నారులు,పెద్దలు కలిసికట్టుగా టపాసులు కాలుస్తూ భజన,డ్రమ్స్,మేళతాళతో వెళ్ళి నిమార్జనం చేశారు.ముఖ్యంగా నేడు మండల వ్యాప్తంగా కొంతెమ్మ పండుగ ఘనంగా జరగనుంది.చుట్టూ పక్కల గ్రామలైన సులువాయి,ఎల్లర్తి, వందవాగలి,హెబ్బటం,గెజ్జెహళ్లి,మర్లమాడికి,చిన్నహ్యట,కొగిలతోట తదితర గ్రామాలో కూడా పెద్ద గౌరమ్మ పండుగను వైభవంగా నిర్వహించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!