
ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయలను ST జాబితాలో చేర్చండి
మోసపోయిన వాల్మీకి జాతికి ఇప్పటికైనా న్యాయం చేయండి
– అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (ఏపీవీబీఎస్)
–
తుగ్గలి న్యూస్ వెలుగు ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (ఏపీవీబీఎస్). రాష్ట్రంలో అత్యంత మోసపోయిన జాతి వాల్మీకి బోయ జాతి అని 2017లో అప్పటి టిడిపి ప్రభుత్వ సమయంలో గవర్నర్ ప్రసంగం మరియు మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్యపాల్ కమిటీ రిపోర్ట్ మరియు కారెం శివాజీ గారి “ఎపి ఎస్సీ, ఎస్టీ కమిషన్” నివేదికల ఆధారంగా తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని వాల్మీకి బోయలు షెడ్యూల్డ్ తెగగా గుర్తించడానికి కేంద్రం నిర్ణయించిన, కావాల్సిన సామాజిక లక్షణాలను, నిర్ణయించే ప్రమాణాలను పూర్తిగా సంతృప్తి పరుస్తారు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిషన్లు చెబుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపినా కానీ కేంద్రంలో ఓఆర్జిఐ, గిరజన శాఖ వారు ఏదో ఒక క్వెర్రీ పెట్టి ఈ ప్రక్రియను ఆపుతున్నారు అని, ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నందుకు ఇప్పటికైనా చొరవ తీసుకుని, చాకచక్యంగా మీ అనుభవాన్ని, చతురతను ఉపయోగించి మోసపోయిన వాల్మీకి బోయ జాతికి న్యాయం జరిగేలా చూడాలని కోరడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ బాబు నాయుడు, బైటప్ప నాయుడు, చంద్ర, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.