వెల్దుర్తి , న్యూస్ వెలుగు; ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ అసోసియేషన్ ఎస్ చాందిని ఆధ్వర్యంలో రజనీదేవి.యశోద. సులోనమ్మ.కళావతమ్మ.రేణుకమ్మ.నాలుగో రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే రిలే నిరాహార దీక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం

ప్రకటించలేదు కావున రేపు ప్రతి జిల్లాలలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయాలని రాష్ట్రంలో ఉన్న మూడు సంఘాల నిర్ణయించాయి కాబట్టి మన జిల్లా నుండి వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అంగన్వాడి వర్కర్స్ కి కర్నూలు జిల్లా అధ్యక్షురాలు చాందిని కార్యకర్తలకు పిలుపు ఇవ్వడం జరిగింది. గురువారం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కి ఎండిఓ వినతి పత్రం ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా కనీస వేతన 26 వేల రూపాయలు ఇవ్వాలని లేని పక్షంలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ధర్నాలు రాబోయే కాలంలో రాజధాని ఢిల్లీ పార్లమెంట్ దగ్గర ధర్నా చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయాలు తీసుకున్నాయి. కాబట్టి ప్రభుత్వం మా సమస్యలపై సరైన నిర్ణయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గురువారం రిలే నిరాహార దీక్ష కూర్చున్న వారికి వెల్దుర్తి ఏఐటీయూసీ నాయకులు జి నాగమద్దయ్య హరిప్రసాద్ మాధవస్వామి చెరుకు రసం ఇచ్చి రిలే దీక్షను విరమించారు. మార్చి 2 తేదీ విజయవాడలోజరిగే బహిరంగ ర్యాలీ కి వేలాదిమంది కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి మన బలం ఏదో నిరూపించాలని ప్రాజెక్ట్ కార్యదర్శి సుజాత కార్యకర్తలకు కోరడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రిష్ణగిరి వెల్దుర్తి అంగన్వాడి కార్యకర్తలు మొదలగువారు
Thanks for your feedback!