ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు అన్యాయం ప్రతిఘటించిన ఏపీ ఎమ్మార్పీఎస్ 

ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు అన్యాయం ప్రతిఘటించిన ఏపీ ఎమ్మార్పీఎస్ 

        శ్రీ దండు వీరయ్య మాదిగ

   కర్నూలు, న్యూస్ వెలుగు;  జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు   బుధవారం ఏపీ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా

నాయకులు బైరాపురం రాజు మాదిగ  ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దండు వీరయ్య మాదిగ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉద్యమం మాదిగలు చేసిన అవిశ్రాంత పోరాటం అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ రిజర్వేషన్లలో మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు దక్కడం లేదని మాదిగలు చేసిన ఆందోళనల ద్వారా ఆనాటి టిడిపి ప్రభుత్వం దిగివచ్చి 1996 లో జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ ఏర్పాటు చేసింది. ఏబిసిడి 4గ్రూపులుగా విభజన చేసి మాదిగలకు న్యాయం చేశారు. 2004 సంవత్సరంలో సుప్రీంకోర్టు ధర్మాసనమ్ ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తీర్పు ఇవ్వటంతో ఎస్సీ వర్గీకరణ అమలకు నోచుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పులో వర్గీకరణ చేసే అధికారం ఒక పార్లమెంట్ కు మాత్రమే ఉందని చెప్పినందున కాంగ్రెస్ ప్రభుత్వం 2004న మూడోసారి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2007 లో జస్టిస్ ఉషా మెహ్ర కమిషన్ బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాయలసీమ కోస్తా పర్యటించి షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు జరిగిన విషయాలను ప్రభుత్వం ద్వారా వివరాలు తీసుకొని జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ను సమర్థిస్తూ పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని 2008లో తమ నివేదికలో మాదిగ ఉప కులాలకు న్యాయం చేయాలని కేంద్రానికి నివేదిక సమర్పించింది. అయితే 1/8/2024లో షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు వర్గీకరణ పై రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ 15/11/2024న బాధ్యతలు తీసుకొని రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లా కేంద్రాలలో కుల సంఘాల ప్రజల విజ్ఞప్తులు స్వీకరించినది. 2011 గణాంకాల ప్రకారం ఎ బి సి 3 గ్రూపులుగా విభజిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినారు. మాదిగలు 30 సంవత్సరాలుగా పోరాడిన రాజీవ్ రంజాన్ మిత్ర కమిషన్ లో ఫలితం శూన్యం. గతంలో తమ వర్గానికి 7శాతం రావడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం కులగణాంకాల రోస్టర్ పేరుతో మాదిగలకు 6% మాలాలకు 8% శాతం ఇతరులకు 1శాతం నివేదిక సమర్పించినారు. అభివృద్ధి చెందిన మాల సామాజిక వర్గానికి అత్యధిక రిజర్వేషన్లు కట్టబెడుతూ అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది అని అన్నారు. అదేవిధంగా మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని మంత్రి వర్గ ఉప సంఘం పునః పరిశీలన చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని మాదిగలకు సమాన రిజర్వేషన్లు అందే విధంగా చూడాలని మంత్రివర్గ ఉప సంఘానికి ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దండు వీరయ్య మాదిగ గారు విజ్ఞప్తి చేశారు. తదనంతరం కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య మేడమ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో బైరాపురం రాజు, మీసాల బాబు, సూరిబాబు, దేవిపుత్ర,రాజశేఖర్,విహార్ రామదాస్, పురుషోత్తం, అబ్రహాము,భీమన్న, లక్ష్మన్న, ఉదయ్, విజయ్, తిరుమలేష్,శేఖర్, అశోక్, యేసు రత్నం,నాగరాజు,దాసురావు, సుజాత,సుంకులమ్మ,అయ్యమ్మ తదితర ఏపీ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా నాయకులు మహిళా నాయకురాలు పాల్గొనడం జరిగినది.

Author

Was this helpful?

Thanks for your feedback!