కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నియామకం.

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నియామకం.

ఉత్తర్వులు జారీ చేసిన భారత ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

 ఏలూరు, న్యూస్ వెలుగు; కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి, గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా నిధులు రాబట్టేందుకు శక్తి వంచన లేకుండా తనవంతుగా కృషి చేస్తానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తనను సభ్యుడిగా నియమించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ చైర్మన్ సిఆర్ పాటిల్, సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇంధనం మరియు సహజవాయువు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తుండగా, తాజాగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా ఎంపీ మహేష్ కుమార్ ను నియమించడం పట్ల ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!