నిరంతర పర్యవేక్షణతో భక్తజన సంద్రానికి ఏర్పాట్లు
సౌకర్యాలు పరంగా ఎక్కడ లోటు ఉన్నా వెంటనే గుర్తించి సరిదిద్దుతున్నాం
సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శన ఏర్పాట్లు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన
విజయవాడ, న్యూస్ వెలుగు; ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వైభవంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్త జనసంద్రాన్ని ముందే ఊహించి చేసిన ఏర్పాట్లతో సామాన్య భక్తులకు సంతృప్తికరంగా అమ్మవారి దర్శన భాగ్యం లభిస్తోంది. జిల్లా కలెక్టర్ సృజన ఆదివారం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో కలిసి క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు తాగునీరు, పాలు, మజ్జిగ తదితరాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ముందే ఊహించి అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎక్కడ సౌకర్యాలు పరంగా లోటు ఉన్నా వెంటనే గుర్తించి సరిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శన భాగ్యం లభించేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
అనంతరం కలెక్టర్ జి.సృజన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం కలెక్టర్ ను వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు.