న్యూస్ వెలుగు, కర్నూల్; కర్నూలు ఈ నెల 8న గార్గేపురం డంప్‌యార్డులోని నగరపాలక కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని,

భారత జంతు సంక్షేమ బోర్డు సభ్యులు పరిశీలించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి, ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం గార్గేపురం డంప్‌యార్డులోని కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో కుక్కల బెడద నివారణకు వీధి కుక్కల సంతాన నియంత్రణ ఆపరేషన్ చేసే ప్రక్రియను పునః ప్రారంభించేందుకు భారత జంతు సంక్షేమ బోర్డుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, వారి బృందం ఈనెల 8న వీధి కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని పరిశీలిస్తుందని కమిషనర్ వెల్లడించారు. అనుమతులు వచ్చాక వీధి కుక్కలకు ఆపరేషన్లను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్యధికారి విశ్వేశ్వర్ రెడ్డి, డిఈఈలు గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, హార్టికల్చర్ ఏడి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!