బెల్ట్ షాపులు నివారించి మద్యం అరికట్టండి DYFI
న్యూస్ వెలుగు, కర్నూలు; బెల్ట్ షాపులు నివారించి మద్యం అరికట్టాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర జిల్లా నాయకులు అబ్దుల్లా,రంగప్ప ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని తెలియజేశారు.సమయం సందర్భం లేకుండా మద్యం ఏరులై పారుతుందని తెలియజేశారు. ఏలాంటి అనుమతులు లేకున్నప్పటికీ కనీసం ప్రభుత్వ అధికారులు పై ఎలాంటి భయభక్తులు లేకుండా గుడులు,బడులు,ప్రధాన రహదారులు లాంటివి కూడా పట్టించుకోకుండా మద్యం అమ్ముతున్నారని తెలియజేశారు. అందుబాటులో మద్యం దొరుకుతున్నందువల్ల ఎప్పుడో ఒకసారి తాగే వాళ్ళు కూడా నిత్యం తాగుతున్నారని అన్నారు. వీటివల్ల నిత్యం ఇళ్లల్లో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని,దాడులకు గురవుతున్నారని తెలియజేశారు. ప్రశాంతమైన ఊరు ఎప్పుడు గొడవలు జరుగుతాయ అని భయపడాల్సిన పరిస్థితి ఉందని తెలియజేశారు. వీరికి రాజకీయ నాయకుల మద్దతు ఉన్నట్లు సమాచారం ఉందని ఇలాంటి వారికి ఏ స్థాయిలో అండదండలుగా ఉన్న వారిపై కూడా కేసు నమోదు చేయాలని మద్యం పూర్తిగా నివారించాలని తెలియజేశారు.