హోళగుంద,న్యూస్ వెలుగు :

రాష్ట్ర వ్యాప్తంగా 2025 సంవత్సరం మార్చ 17 నుండి ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంఎస్ సందేశ్,సింగం ప్రవల్లిక,బి యం ఫాతిమా,వై పూజ,హెచ్ రంజిత్ కుమార్లు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాల టాపర్లుగా నిలిచారు.దీంతో సోమవారం కర్నూలు పుష్పరాజ్ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి టివి భరత్,జెసి బి నవ్య,జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ చేతుల మీదుగా విద్యార్థులకు ప్రతిభ పురస్కారం మెడల్,ప్రశంసా పత్రం,ప్రతి విద్యార్థికి రూ.20000/- చెక్కు అందజేసి విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీత విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్,కబీర్ సాబ్,ఉపాధ్యాయులు,ఎంఈఓలు సత్యనారాయణ,జగన్నాథం,సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Thanks for your feedback!